ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో కెనెటిక్ గ్రీన్ కంపెనీకి మంచి పేరే ఉంది. పుణెకు చెందిన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నుంచి టూవీలర్స్ తో పాటు.. 3 వీలర్స్, ఎలక్ట్రిక్ బగ్గీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి 3 రకాల ఎలక్ట్రిక్ స్కూటీలు మార్కెట్లో అందుబాటులో ఉండగా.. వాటికి అదనంగా ఇప్పుడు మరో మోడల్ ‘కెనటిక్ గ్రీన్ జులు’ ని లాంఛ్ చేసింది కంపెనీ. అది కూడా కేవలం రూ.లక్షలోపు ధరతోనే తీసుకొచ్చారు.
ఫీచర్లు, ధర వివరాలివే
కెనటిక్ గ్రీన్ జులు మోడల్ ఎక్స్ షోరూమ్ ధర ఫేమ్ టూ సబ్సిడీ పోయిన తర్వాత రూ.95 వేలుగా ప్రకటించారు. లుక్స్ పరంగా కూడా ఈ జులు మోడల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. యాప్రాన్ మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఇక, ఈ బైక్ బ్యాటరీ విషయానికి వస్తే.. 2.27 కిలో వాట్ పర్ అవర్ కెపాసిటీ లీథియమ్ ఇయాన్ బ్యాటరీతో వస్తోంది. 2.8 బీహెచ్పీ పీక్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఈ బ్యాటరీ ఛార్జ్ కూడా ఈవీలో ఒక రెవల్యూషన్ అవుతంది. 15 యాంప్ సాకెట్ తో మీరు కేవలం అరగంటలోనే 80 శాతం బ్యాటరీని ఛార్చ్ చేయచ్చు. ఇది సింగిల్ ఛార్జ్ తో 104 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 60 కిలీమీటర్లుగా ఉంది. నిజానికి ఇది తక్కువ అని భావన కలగచ్చు. కానీ, సిటీల్లో మీరు 50 కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ ప్రయాణించలేరు.
ఈ జులు బైక్ 1,830mm పొడవు, 715mm వెడల్పు, 1,135mm ఎత్తుతో వస్తోంది. ఇంక దీని వీల్ బేస్ కూడా 1,360mmతో వస్తోంది. 160mm గ్రౌండ్ క్లియరెన్స్ తో ఈ కెనెటిక్ గ్రీన్ జులు ఎలక్ట్రిక్ స్కూటీ వస్తోంది. ఈ బైక్ గరిష్టంగా 150 కిలోల వరకు క్యారీ చేయగలదు. ఈ బైక్ ని పూర్తిగా ఇండియాలోనే తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలియజేస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే జింగ్ హెచ్ఎస్ఎస్, జింగ్, ఫ్లెక్స్, జూమ్ అనే మోడల్స్ ఉన్నాయి. అలాగే 3 వీలర్స్ లో ప్యాసెంజర్ ఆటోలు, క్యాబిన్ ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ బగ్గీలు కూడా విక్రయిస్తున్నారు. మరి.. ఈ కెనెటిక్ గ్రీన్ కంపెనీ లాంఛ్ చేసిన జులు అనే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.