Tuesday, October 8, 2024

Hockey WC | రేపే క్వార్టర్ ఫైనల్.. భార‌త్ – నెద‌ర్లాండ్స్ ఢీ !

మలేషియాలో జ‌ర‌గుతున్న ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భార‌త్ పురుషుల జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తొంది. కౌలాలంపూర్ వేధికగా శనివారం జరిగిన తమ చివరి గ్రూప్-స్టేజ్ గేమ్‌లో కనెడాపై 10-1 పాయింట్ల తేడాతో గెలిచి క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించింది భార‌త్. కాగా, రేపు (మంగళవారం) జరగనున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది భారత జట్టు. ఈ మ్యాచ్ రేపు (డిసెంబర్ 12న) ఉదయం 8:45 కి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18, JioCinemaలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

ఇక, ఈ టోర్నీలో మొద‌టి నుంచి పూల్ ‘ సి’లో ఉన్న భార‌త్… రెండో స్థానంలో నిలిచింది. త‌మ మొద‌టి గ్రూప్ గేమ్‌లో కొరియాపై 4-2 తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది భారత జట్టు. అయితే, స్పెయిన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిపోయింది. ఇక, క్వార్టర్స్‌కి చేరాలంటే తప్పక గెలవాల్సిన చివరి గ్రూప్ గేమ్‌లో… భారత్ 10-1తో కెనడాను చిత్తు చేసింది. ఇక మరోవైపు పూల్ ‘ డి’లో ఉన్న నెదర్లాండ్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement