Saturday, March 2, 2024

kedarnath – చాయ్ వాలాగా రాహుల్ గాంధీ – భక్తులకు స్వయంగా తేనీరు పంపిణీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో భక్తులకు టీ సప్లై చేశారు. మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ఆదివారం కేదార్‌నాథ్ ఆలయాన్నిసందర్శించి పూజలు చేశారు. హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయం క్యూలో ఉన్న భక్తులకు రాహుల్ స్వయంగా టీ సప్లై చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

అంతకుముందు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. కులగణనపై ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు మరిన్ని ప్రయోజనాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులను బీజేపీ ‘ఆదివాసీ’ అని కాకుండా ‘వనవాసీ’ అని పిలుస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి బదులు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement