Sunday, April 21, 2024

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. భాజపా, కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) ప్రధానంగా పోటీపడుతున్నాయి..అన్ని పార్టీలు, స్వతంత్రులతో కలిపి మొత్తం 2,165 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 72.36 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి అంతకు మించి పోలింగ్‌ నమోదు చేసేందుకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5.31 కోట్ల మంది ఓటు వేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement