Saturday, December 7, 2024

చంద్ర‌ముఖి 2 లో కంగ‌నా ఫ‌స్ట్ లుక్ …

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమారు పద్దెనిమిదేళ్ల త‌ర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. లారెన్స్ ను హీరోగా పెట్టి పి.వాసు ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాడు. కంగనా రనౌత్ కథానాయిక. . ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి లారెన్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ ఇటివ‌లే విడుద‌ల చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి కంగనా రనౌత్ ఫ‌స్ట్ లుక్ ను మేక‌ర్స్ విడుద‌లైంది…

అద్దం ముందు నిలుచుని తనని తాను చూసుకుంటున్న ఈ లుక్ అభిమానుల‌ను క‌ట్టి ప‌డేస్తుంది. ఈ లుక్‌పై మేక‌ర్స్ స్పందిస్తూ.. “అందం అభినయంతో కట్టిపడేసే చంద్రముఖిగా మన ముందుకు వస్తుంది కంగనా రనౌత్” అంటూ మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement