Tuesday, May 21, 2024

భావితరాల స్ఫూర్తిప్రదాత జ్యోతిరావు పూలే

ఖమ్మం : సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహాన్ని మంగళవారం ఉదయం ఎంపీలు వద్దిరాజు, బండి, నామాలు సందర్శించారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళల సముద్ధరణకు ఆయన చేసిన అమూల్యమైన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డిల వెంట జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు,మేయర్ నీరజ,డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లమల వెంకటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement