Wednesday, October 16, 2024

ఎన్టీఆర్ యూనివ‌ర్శిటీ పేరు మార్చ‌డం క‌రెక్ట్ కాదు- హీరో ఎన్టీఆర్

వైసీపీ ప్ర‌భుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చ‌డంపై త‌న స్పంద‌న తెలిపాడు హీరో..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. సీనియ‌ర్ ఎన్టీఆర్, వైఎస్సార్ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని అన్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఈ రకంగా ఒకరి పేరు తీసి మ‌రొక‌రి పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని.. అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని అన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్నవారి జ్ఞాపకాలు చెరిపివేయలేరని అన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చెప్పారు. ఇదొక దురదృష్టకరమైన పరిణామమ‌న్నారు. ఈ అంశంపై ఇప్ప‌టికే ప‌లువురు స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement