Thursday, May 2, 2024

అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్..

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  తమ అభిమాన హీరోను కలవాలని, ఒక్కసారైనా మాట్లాడాలని ఫ్యాన్స్ ఆశ పడతారు. ఎన్టీఆర్ సైతం తన అభిమానుల కోరికలను తీర్చడంలో ఎప్పుడూ ముందుంటారు. గతంలో చాలాసార్లు తన అభిమానుల కోరికలను తీర్చిన ఎన్టీఆర్.. తాజాగా మరోసారి తన అభిమానికి కోరిక తీర్చాడు.  చావుబతుకుల్లో ఉన్న అభిమానిని పలకరించి అతడిని అనందంలో ముంచెత్తారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మరింతగా విషమించింది.

ఈ క్రమంలో వైద్యులు అతడి కోరికలు, ఇష్టాయిష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని చెప్పాడు. దీంతో వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మురళితో మాట్లాడారు. త్వరగానే కోలుకుంటావంటూ అతడిలో ధైర్యం నింపారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తావంటూ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement