Friday, April 19, 2024

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ సాయంత్రం వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. కొవిడ్‌ నేపథ్యంలో భక్తులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా వాహనసేవలను ఆలయంలోని కళ్యాణ వేదికలోనే నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

వాహనసేవలు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామని.. గరుడ వాహన సేవను రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కోవిడ్ తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూన్నామని… ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడంతో స్వర్ణరథం, మహరథం బదులుగా సర్వభూపాల వాహన సేవను నిర్వహిస్తామని చెప్పారు. చక్రస్నాన కార్యక్రమాని ఆలయంలోని అద్దాల మహల్ లో నిర్వహిస్తామని.. రాష్ర్ట ప్రభుత్వం తరపున 11వ తేదిన సీఎం జగన్ పట్టువస్ర్తాలను సమర్పిస్తారన్నారు. 11వ తేదిన బర్డ్ హస్పిటల్ ప్రాంగణంలో పిడియాట్రిక్ కార్డిక్ హస్పిటల్ ,గో మందిరం,అలిపిరి నడకమార్గాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే… టిటిడి వాహనాల ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తరలిస్తామని ఆయన ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ప్రభాస్ 25వ సినిమాకు ‘స్పిరిట్’ టైటిల్ ఫిక్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement