Sunday, October 6, 2024

తండ్రి శ‌వ పేటిక ముందు ఫొటోషూట్-తర్వాత ఏం జరిగింది..

సోష‌ల్ మీడియా వ‌చ్చాక త‌మ‌ని తాము ప్ర‌మోట్ చేసుకోవ‌డం ఎక్కువ‌యింది. తామో సెల‌బ్రిటీ కావాల‌ని..అంద‌రి దృష్టిలో ప‌డేందుకు నేటి యూత్ త‌హ త‌హ‌లాడుతోంది. హ‌ద్దు మీర‌నంత‌వ‌కు స‌రే అదే హ‌ద్దులు దాటితే నెటిజ‌న్స్ తో చీవాట్లు తినాల్సిందే. వివ‌రాల్లోకి వెళ్తే..ఓ యువ‌తి చేసిన ప‌ని విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. స్వ‌యాన క‌న్న తండ్రి అంత్య‌క్రియ‌ల్లో ఫొటో షూట్ చేయ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. అల్ట్రా మాడ్రన్ డ్రెస్సులో తండ్రి శవం పక్కన నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఫ్లోరిడాలోని మియామికి చెందిన ఇరవై యేళ్ల సోషల్ మీడియా సెలబ్రిటీ …జేని రివెరా తండ్రి ఇటీవల వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియల్లో భాగంగా మృతదేహాన్ని శవపేటికలో పెట్టారు. అయితే, శవపేటిక ముందు జేని రివెరా ఫ్యాషన్ దుస్తులు ధరించి, వివిధ భంగిమల్లో నవ్వుతూ ఫొటోలు దిగి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఫాలోవర్లు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి మృత‌దేహం వద్ద ఫొటో షూట్ ఏంటని మండిపడ్డారు.

త‌క్ష‌ణ‌మే ఆ ఫొటోలు తొలగించి, క్షమాపణ చెప్పకపోతే ఇన్ స్టాలో ఫాలో అవడం మానేస్తామని మరి కొందరు హెచ్చరించారు. అయితే, వీటన్నింటిని జెనీ లైట్ గా తీసుకుంది. ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఈ నేప‌ధ్యంలో నెటిజ‌న్స్ నుంచి వస్తున్న విమర్శల వరద ఆగలేదు. దీంతో నెటిజన్ల నుంచి వస్తున్న నెగెటివ్ కామెంట్స్ ను భరించలేక రివెరా ఏకంగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నే డియాక్టవేట్ చేసింది. అయితే, నెటిజన్లకు ఎలాంటి వివరణ, క్షమాపణ చెప్పకుండానే ఖాతాను డిలేట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement