Friday, April 26, 2024

దీపికాపదుకొనేలా డ్యాన్స్ చేసిన.. జపాన్ మహిళ.. వైరల్ అవుతోన్న వీడియో

పఠాన్ మూవీ రిలీజ్ కి ముందే పలు వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలో స్టార్ నటులు షారుక్ ఖాన్..దీపికా పదుకొనే జంటగా నటించారు. ఈ సినిమాలో బేష‌రం రంగ్ సాంగ్‌పై ప‌లు సంఘాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. తాజాగా ఇదే సాంగ్‌కు జ‌పాన్ మ‌హిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైర‌ల‌వుతోంది. మ‌యో జ‌పాన్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేయ‌గా ఇప్ప‌టికే ల‌క్ష‌కు పైగా వ్యూస్ ల‌భించాయి. ఈ వీడియోలో మ‌యో బేష‌రం రంగ్ సాంగ్‌లో దీపిక డ్యాన్స్‌ను అనుక‌రించ‌డం క‌నిపిస్తుంది. దీపిక సిగ్నేచ‌ర్ స్టెప్స్‌ను ఈజ్‌తో అనుక‌రించేందుకు ప్ర‌య‌త్నించింది.

ఈ క్లిప్‌లో కనిపించిన క‌కెట‌కు షారుక్ ఖాన్ పాత్ర‌ను అనుక‌రించాడు. జ‌పాన్ నుంచి బేష‌రం రంగ్. దీపికా ప‌దుకొనేలా డ్యాన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించినా ఆమెలా చేయ‌లేక‌పోయాను. అందుకు క‌నీసం ప్ర‌య‌త్నించా అని ఈ పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన వారంతా మ‌యో డ్యాన్సింగ్ స్కిల్స్‌కు ఫిదా అయ్యారు. దీపిక స్టెప్స్‌ను మ‌యో త‌న‌దైన శైలిలో ప‌ర్‌ఫెక్ట్‌గా దించేశార‌ని మెచ్చుకున్నారు. ఈ సాంగ్‌ను హృద్యంగా ఆల‌పించిన శిల్పా రావు సైతం మ‌యో డ్యాన్స్‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement