Sunday, April 28, 2024

Janasena Symbol: గ్లాసు గుర్తు జ‌న‌సేన‌దే…

ఎన్నిక‌ల వేళ ఊర‌ట‌
గుర్తు త‌మ‌దే అంటూ ఆర్ పి కే పార్టీ పిటిష‌న్
హైకోర్టులో సుదీర్ఘంగా సాగిన విచార‌ణ
ఆర్ పి కె పిటిష‌న్ కొట్టివేత‌
హైకోర్టు తీర్పుతో జ‌న‌సేన‌కు చిక్కిన గ్లాస్

హైద‌రాబాద్ – ఎపి అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నికల వేళ జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఈసీ ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీలను మాత్రమే లోకల్ పార్టీలుగా గుర్తించి, జనసేన పార్టీని రిజిస్టర్ పార్టీ కేటగిరిలో ఉంచింది. దీంతో ఆ పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసు గుర్తును ఎవరైనా కోరితే వారికే కేటాయించే అవకాశం ఉంది. దీంతో వెంటనే జనసేన గాజు గ్లాసు గుర్తుకు రిజిస్టర్ చేసుకొగా ఈ గుర్తును జనసేనకు కేటాయించారు.

అయితే ఈ గాజు గ్లాసు గుర్తు కోసం తాము మొదట దరఖాస్తు చేసుకున్నామని ఆ గుర్తుని తమ పార్టీకే కేటాయించ‌కుండా జ‌న‌సేన‌కు ఇచ్చిందంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరు పార్టీల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

కాగా ఈ రోజు ఆ తీర్పును ప్రకటించింది. ఆర్ పి కె వేసిన ప‌టిష‌న్ ను కొట్టివేస్తూ .. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించ‌డం స‌రైన‌దేనంటూ హైకోర్టు తేల్చి చెప్పింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement