Friday, May 17, 2024

Jammu & Kashmirకు ఇక సంపూర్ణ స్వేచ్చ – 370 అర్టిక‌ల్ ర‌ద్దులో జోక్యం చేసుకోలేమ‌న్న సుప్రీం కోర్టు

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూకశ్మీర్‌ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని చీఫ్ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం వాదనను సమర్థించింది. పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. ‘‘జమ్మూకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరు. తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్‌ 370 పెట్టారు. ఆర్టికల్‌ 1, ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే’’ అని సీజేఐ వెల్లడించారు.

జమ్ము కశ్మీర్ భారతదేశంలో విలీనం సమయంలో అప్పటి సంస్థానాధిపతులతో కుదిరిన ఒప్పందం మేరకు ఆ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేర్చారు. నాలుగున్నరేళ్ల క్రితం అంటే 2019 ఆగస్టు 6న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఈ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసి తీర్పు నేడు వెలువ‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement