Friday, May 3, 2024

Jallikattu – తమిళనాడులో జల్లికట్టు పోటీలు ప్రారంభం

చెన్నై – సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని జల్లికట్టు పోటీలు ప్రారంభమైయ్యాయి. మొదటి రోజు మధురై జిల్లాలోని అవనియాపురం గ్రామంలో జల్లికట్టు పోటీలు ఆరంభమయ్యాయి. . ఈ జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయక క్రీడ..

వరుసగా మూడు రోజుల పాటు సాగే ఈ క్రీడలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. మొదటి రోజు అవనియాపురంలో, రెండో రోజు పాలమేడులో, మూడో రోజు అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. అవనియాపురం జల్లికట్టు కోసం మొత్తం 2,400 ఎద్దులు, 1,318 టామర్లు, పాలమేడు జల్లికట్టుకు 3,677 ఎద్దులు, 1,412 టామర్లు, అలంగనల్లూరులో 6,099 ఎద్దులు, 1,784 టామర్లు నమోదు చేసుకున్నట్లు మదురై జిల్లా కలెక్టరేట్‌లో గతంలోనే సమాచారం తెలిపిన విషయం విదితమే.

కాగా, కొత్తగా నిర్మించిన మధురై జల్లికట్టు స్టేడియంను జనవరి 23న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఓపెనింగ్ చేయనున్నారు. మదురై జిల్లాలోని అలంగనల్లూరు సమీపంలో నిర్మిస్తున్న కొత్త జల్లికట్టు స్టేడియానికి రాష్ట్ర మాజీ సీఎం, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరు పెట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement