Monday, April 29, 2024

Chandrayan-3: అరుదైన ప్రయోగంలో విజయం సాధించాం ఇస్రో..చంద్ర కక్ష్య నుంచి భూకక్ష్యలోకి ప్రొపల్షన్ మాడ్యూల్‌

చంద్రయాన్​-3 ప్రాజెక్ట్​లో మరో కీలక అడుగు ముందుకు పడింది. చంద్రుని దక్షణ ధ్రువం పైన ల్యాండ్ అయ్యి ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ఘనత సాధించింది. తాజాగా ఇస్రో.. జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలు​ చెప్పారు.

చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్నామని.. తాజా ప్రయోగం ఆ మిషన్​కు దోహదపడుతుందని తెలిపారు. నమూనాలను తీసుకొని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్​లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement