Friday, May 3, 2024

మొద‌లైన ఐఫోన్15 సేల్స్.. యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం!

యాపిల్ నుంచి కొత్తగా లాంఛ్ అయిన ఐఫోన్ 15 ఫోన్ల రిటైల్ విక్రయాలు నేటి నుంచి (సెప్టెంబర్ 22) ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ల కోసం యాపిల్ స్టోర్ల వద్ద వినియోగదారులు క్యూ కట్టారు. ఆన్‌లైన్‌తో కూడా ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తున్నాయి. ఐఫోన్ 14 కంటే 15లో భారీ మార్పులు చేయడమే ఈ డిమాండ్‌కు కారణం. యాపిల్ అధికారిక వెబ్ సైట్లో ట్రై చేస్తే మోడల్‌ను బట్టి రెండు నుంచి మూడు వారాల మధ్యలో డెలివరీ చూపిస్తుంది.

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ సెప్టెంబర్ 12న వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్‌ రిలీజ్ చేసింది. గతంలో లాంచ్ అయిన ఐఫోన్ 14 సిరీస్ కంటే ఇందులో మెరుగైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్లు చేశారు. ఈ సిరీస్‌లో ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. గతేడాది ప్రో మోడల్స్‌లో అందించిన ఈ ఫీచర్లను ఇప్పుడు స్టాండర్డ్ వేరియంట్స్‌లో కూడా అందించారు. ఈ రెండు ఫోన్లలోనూ యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు.

యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో చూపిస్తున్న డెలివరీ ఆప్షన్ల ప్రకారం… ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ప్రారంభ వేరియంట్ల డెలివరీ అక్టోబర్ ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. టాప్ స్టోరేజ్ వేరియంట్లు మాత్రం అక్టోబర్ 4వ తేదీ నుంచి డెలివరీ కానున్నాయి.

ఐఫోన్ 15 మోడల్స్, ధరలు..

ఐఫోన్‌ 15

- Advertisement -

సైజు – 147.6 X 71.6 X 7.8ఎంఎం. తెర : 6.1 అంగుళాలు, బరువు : 171 గ్రా., చాసిస్‌ : అల్యూమినియం, మెయిన్‌ కెమెరా : 48 MP, అల్ట్రా వైడ్ : 12MP, బ్యాటరీ : 3877, ఎహెచ్‌, ఓఎస్‌ : ఐఓఎస్‌ 17, ధర: రూ. 79,900

ఐఫోన్‌ 15 ప్లస్‌

సైజు – 147.6 X 71.6 X 7.8ఎంఎం., తెర : 6.7 అంగుళాలు, బరువు : 171 గ్రా., చాసిస్‌ : అల్యూమినియం, మెయిన్‌ కెమెరా : 48 MP, అల్ట్రా వైడ్ : 12MP, బ్యాటరీ : 4912 ఎంఎహెచ్‌, ఓఎస్‌ : ఐఓఎస్‌ 17, ధర : రూ.89,900

ఐఫోన్‌ 15ప్రొ

సైజు-146.6 X 70.6 X 8.25ఎంఎం. తెర : 6.1 అంగుళాలు, బరువు : 188 గ్రా. చాసిస్‌ : టైటానియం, మెయిన్‌ కెమెరా : 48 MP, టెలీఫోటో: 12.7MP, అల్ట్రా వైడ్ : 13.4 MP, బ్యాటరీ : 3650 ఎంఎహెచ్‌, ఓఎస్‌ : ఐఓఎస్‌ 17, ధర: రూ.1,34,900

ఐఫోన్‌ 15 ప్రొ మ్యాక్స్‌

సైజు – 159.9 X 76.7 X 8.25ఎంఎం. తెర : 6.7 అంగుళాలు బరువు : 221గ్రా. చాసిస్‌ : టైటానియం మెయిన్‌ కెమెరా : 48 MP, టెలీఫోటో: 12.7MP – 85ఎంఎం పెరిస్కోప్‌, అల్ట్రా వైడ్ : 13.4 MP బ్యాటరీ : 4852 ఎంఎహెచ్‌ ఓఎస్‌ : ఐఓఎస్‌ 17 ధర : 1,59,900

యాపిల్ వాచ్‌లు

యాపిల్‌వాచ్‌ 9 ను కూడా యాపిల్ విడుదల చేసింది. ఎస్‌9 చిప్‌తో పాటు, 18 గంటల బ్యాటరీ లైఫ్‌ దీని ప్రత్యేకతలు. వాచ్‌ఓఎస్‌ 10తో రానుంది. దీని ధర రూ. 41,900 ఉండనుంది. అలాగే యాపిల్ వాచ్ ఎస్ఈ2ను లాంచ్ చేసింది. దీని ధర 29,9900గా ఉండనుంది.

యాపిల్‌ వాచ్‌ అల్ట్రా2: సాహసయాత్రికుల కోసం గతేడాది వచ్చిన అల్ట్రాకు కొనసాగింపిది. సిగ్నల్‌ లేకపోయినా సాటిలైట్‌ సహాయంతో పనిచేస్తుంది. కఠినమైన వాతావరణాలలోనూ, ఎక్కువ నీటి లోతుల్లోనూ ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement