Thursday, May 2, 2024

ఆర్టీసీ డిపోలో దుకాణాల టెండర్లకు ఆహ్వానం.. ఆగస్టు 3 వరకు స్వీకరణ..

పరిగి, (ప్రభ న్యూస్‌): టీఎస్‌ఆర్‌టీసీ పరిగి డిపో గంజి రోడ్‌లో కొత్త‌గా నిర్మించి ఉన్న 36 దుకాణ సముదాయాల కేటాయింపుకు గాను టెండర్లకు ఆహ్వానిస్తున్నట్లు పరిగి డిపో మేనేజర్‌ పవిత్ర ఒక ప్రకటనలో తెలిపారు. డి ఓ పి పథకం కింద నిర్మించనున్న దుకాణాలు10 సంవత్సరాల లీజు తీసుకునేందుకు ఆసక్తిగల వారు ఆగస్టు నెల 3వ తేదీ వరకు టెండర్‌ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ధరఖాస్తు ఫారాలు రూ. 885 చెల్లించి స్థానిక డిఎం కార్యాలయంలో పొందవచ్చని ఆమె తెలిపారు. ధరఖాస్తు ఫారాలు వచ్చే నెల 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

దరఖాస్తు ఫారం తీసుకునే సమయంలో ఆధార్‌ కార్డు ను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేవారు తమ దరఖాస్తు ఫారం తో పాటు రూ.58 వేల డిడి జతచేసి అందజేయాలని సూచించారు. టెండర్‌లో దుకాణం దక్కించుకున్న వారు రూ.5.22 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. టెండర్‌ దక్కని వారికి డి డి డబ్బులు తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్‌,: 9959225153, 9912921415 నంబర్లను సంప్రదించాలని ఆమె తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement