Friday, October 11, 2024

ఫేస్‌బుక్‌ పరిచయం.. పాకిస్తాన్‌ యువతిని పెళ్లాడిన యూపీ యువకుడు

ఫేస్‌బుక్‌ స్నేహం తర్వాత ఉత్తరప్రదేశ్‌ వ్యక్తి పాక్‌ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఫరూఖాబాద్‌కు చెందిన 23 ఏళ్ల జర్దోజీ
కళాకారుడు అయి మహ్మద్‌ జమాల్‌ ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో స్నేహం చేశాడు. అదికాస్తా ప్రేమగా మారింది. వారి ప్రేమ చిగురించిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ అమ్మాయి పాకిస్తానీ అని తెలిసింది. అయినా కూడా మహ్మద్‌ జమాల్‌ వెనుకడుగు వేయలేదు. జూన్‌ నెల మొదటి వారంలో పాకిస్తాన్‌కు వెళ్లాడు. పాకిస్తాన్‌ అమ్మాయి ఎరామ్‌ను కలిశాడు. జూన్‌ 17వ తేదీన ఎరామ్‌ను వివాహం చేసుకున్నాడు.

కొడుకు వివాహం విషయమై జమాల్‌ తండ్రి అలీముద్దీన్‌ మాట్లాడుతూ ”ఇప్పుడు ఈ జంట భారతదేశానికి తిరిగి రావడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. కొత్తగా పెళ్లయిన జంట ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆచారాల ప్రకారం ఘనంగా వేడుకలు నిర్వహిస్తాము. ఫరూఖాబాద్‌ జిల్లా యంత్రాంగం ఆ దంపతులకు అన్నివిధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ”అమ్మాయికి మొదటి ఏడాది తాత్కాలిక వీసా లభిస్తుందని, దానిని మూడేళ్ల వరకు పొడిగించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఆమె ప్రత్యేక వివాహ చట్టం కింత శాశ్వత జాతీయత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు” అని జమాల్‌ తండ్రి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement