Tuesday, April 23, 2024

రెస్టారెంట్ బిజినెస్ లోకి – సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు

ప‌లువురు సినీ న‌టీన‌టులు సినిమాల‌తోనే కాకుండా ప‌లు బిజినెస్ ల‌తో బిజీగా మారుతున్నారు. కాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్
మ‌హేష్‌బాబు న‌టుడిగా, నిర్మాత‌గా, వ్యాపార వేత్త‌గా రెండు చేతుల్లో సంపాదిస్తున్నాడు. ఇప్ప‌టికే మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట‌రైయ్యాడు. ఈయ‌న పేరుమీదున్న AMB సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఒక‌టి. ఇక మ‌హేష్ కేవ‌లం థియేట‌ర్ బిజినెస్ మాత్ర‌మే కాకుండా క్లోతింగ్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త ఈ బిజినెస్‌ల‌ను చూసుకుంటుంది. మ‌హేష్‌బాబు తాజాగా రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంట‌ర‌య్యాడు. మిన‌ర్వ గ్రూప్‌తో క‌లిసి బంజారాహిల్స్‌లో రెస్టారెంట్ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తున్నాడు.ఇప్ప‌టికే రెస్టారెంట్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement