Tuesday, April 30, 2024

అస్సాం వ‌ర‌ద‌ల్లో – మ‌రో ఇద్ద‌రు మృతి

గ‌డిచిన 24గంట‌ల్లో వ‌ర‌ద‌నీటిలో మునిగి ఇద్ద‌రు మ‌ర‌ణించారు. కాగా వారు నాగావ్ జిల్లాకు చెందిన వారని అధికార యంత్రాంగం పేర్కొంది. తాజా బులిటెన్ ప్రకారం 3.68 లక్షల మందికి పైగా వరదలతో ప్రభావితం అయ్యారు. అస్సాంలో వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతోంది. అలాగే కాచర్ లో దాదాపు 1.5 లక్షల మంది, మోరిగావ్ లో 41,000 మందికి వ‌ర‌ద‌ల దాటికి గుర‌య్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT) రాష్ట్రానికి చేరుకుంది. ముందస్తు వరదలు, కొండచరియలు అస్సాంలోని పెద్ద ప్రాంతాలను ప్రభావితం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 47,139.12 హెక్టార్లలో పంట నష్టం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement