Friday, May 17, 2024

TS | కోడ్ కూసింది, తనిఖీలు మొదలయ్యాయి.. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ల ఏర్పాటు

ఎన్నికల నగర మూవీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో తనిఖీలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలని నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువ మొత్తంలో నగదు తో రవాణా చేయవద్దని, స్పష్టమైన రసీదులు ఉంటే తప్ప నగదు సీజ్ చేయబడుతుందని పోలీసులు తెలియజేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఐదు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు తెలియజేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఒక అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ తో పాటు తొమ్మిది అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement