Friday, April 26, 2024

హోమ్ టూర్ చేసిన జాన్వీకపూర్.. నా బాత్ రూంకి లాక్ ఉండదని చెప్పిన నటి

చెన్నైలోని తమ పాత ఇంటిని కొత్తగా చేశామని హోమ్ టూర్ చేసి వీడియోని రిలీజ్ చేసింది హీరోయిన్ జాన్వీకపూర్.శ్రీదేవి నటిగా తన కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలో చెన్నైలోనే ఎక్కువ రోజుల పాటు ఉండిపోయేవారు. ఆ సమయంలో ఆమె కొనుగోలు చేసిన ఇల్లు ఇది. 2018లో శ్రీదేవి మరణం తర్వాత ఇంటిని నవీకరించారు. ఈ ఇంటిపై తన మనసులోని భావాలను జాన్వీ అభిమానులతో పంచుకుంది. ఈ ఇంటికి సంబంధించి చెప్పాలంటే.. ఈ ఇంటితో నాకు మిగిలిన జ్ఞాపకాలతోపాటు, ఇది ఎంతో పాతది. మా వరకు కొంచెం కొత్తది. ఈ ఇంట్లోని నా గది బాత్ రూమ్ కు గడియ ఉండదు. లాక్ పెట్టేందుకు అమ్మ అంగీకరించకపోవడం నాకు గుర్తుంది. బాత్ రామ్ లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడతానేమోనన్న భయం అమ్మలో ఉండేది.

అందుకే నా బాత్ రూమ్ డోర్ కు లోపలి వైపు గడియ పెట్టేందుకు అనుమతించలేదు. ఇప్పుడు ఈ గదులన్నీ కొత్తదనం సంతరించుకున్నా గానీ, నా బాత్ రూమ్ కు మాత్రం లాక్ ఉండదు’’అని జాన్వీ వివరించింది. ఈ వీడియోలో భాగంగా చెన్నై ఇంటిలో తనకు ఇష్టమైన ప్రదేశాలను జాన్వీ చూపించింది. ఈ ఇల్లు పాత కాలం నాటి సినిమాల్లో సంపన్నుల ఇల్లు మాదిరి, అద్భుతమైన ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ తో ఉండడం విశేషం. ఈ వీడియోలో ఆమె తండ్రి బోనీ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా కనిపిస్తారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement