Wednesday, May 1, 2024

గగన్ వ్య‌వ‌స్థ‌ను ఉపయోగించిన తొలి సంస్థగా ఇండిగో రికార్డ్‌..

విమాన ప్రయాణాలు ప్రారంభమైనప్పటి నుంచి విదేశాల్లో రూపొందించిన నావిగేషన్‌ వ్యవస్థ ఆధారంగా పైలెట్లు విమానాలు నడుపుతున్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా సొంత నావిగేషన్‌ వ్యవస్థకి కేంద్రం శ్రీకారం చుట్టింది. దీంతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) సంస్థలు సంయుక్తంగా గగన్‌ (జీపీఎస్‌ ఎయిడెడ్‌ జియో ఆగ్యుమెంటెడ్‌ నావిగేషన్‌) వ్యవస్థను అభివృద్ధి చేశాయి.

విమాన ప్రయాణాలకు సంబంధించి దేశీయంగా తయారు చేసిన గగన్‌ వ్యవస్థను ఉపయోగించిన తొలి సంస్థగా ఇండిగో రికార్డు సృష్టించింది. ఇండిగో సంస్థ ఏప్రిల్‌ 27న ఏటీఆర్‌ 72 ఎయిర్‌క్రాఫ్ట్‌ను గగన్‌ ఆధారంగా నడిపించింది. ఈ విమానం గగన్‌ను ఉపయోగిస్తూ విజయవంతంగా రాజస్థాన్‌లోని కిషన్‌గడ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. చిన్న విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌కు గగన్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్ట్రుమెంటల్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ లేని ఎయిర్‌పోర్టుల్లో గగన్‌ ద్వారా సులువుగా ల్యాండ్‌ అవడం సాధ్యమవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement