కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లో అద్భుతంగా రాణించి, భారత్‌కు పతకాలు సాధించి పెట్టిన వెయిట్‌లిఫ్టర్లు శనివారంనాడు బర్మింగ్‌హామ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చారు. అమృత్సర్ విమానాశ్రయంలో భారత వెయిట్లిఫ్టర్లకు ఘనస్వాగతం లభించింది.
వరల్డ్ కప్ షూటింగ్ స్క్వాడ్‌కు ఘనసన్మానం..
సుహ్ల్(జర్మనీ), చాంగ్వాన్(కొరియా)లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ స్టేజెస్‌లో ఇండియన్ జూనియర్, సీనియర్ షూటింగ్ స్క్వాడ్స్ అద్భుతంగా రాణించి, పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఆ క్రీడాకారులందరినీ ఈ రోజు (శనివారం) ఢిల్లిలోని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఏఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాలికేష్ నారాయణ్ సింగ్ దేవ్, ఎన్ఆర్ఏఐ సెక్రటరీ జనరల్ కె. సుల్తాన్సింగ్, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ (కేఎస్ఎస్ఆర్) అడ్మినిస్ట్రేటర్ డా. జీపీ గోస్వామి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.