Thursday, November 7, 2024

AP – బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు – ఇద్దరి మృతి

రాజమండ్రి – తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ. ఘటన ఉండ్రాజవరం మండలం సూర్యరావు పాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పిడుగు దాటికి బాణాసంచా తయారీ కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్ అయ్యింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మిగతా కూలీలు ప్రాణభయంతో సమీపంలోని అరటి తోటల్లోకి పరిగెత్తారు.

ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరణించిన ఇద్దరు మహిళలు.. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement