Thursday, February 29, 2024

Indian Railway: రైల్వే బోర్డు ఛైర్మన్‌గా అనిల్‌ కుమార్‌

భారతీయ రైల్వే బోర్డు సీఈవో, చైర్మన్ గా 1984 ఐఆర్ఎస్ (ఇండియన్ రైల్వే సర్వీస్) బ్యాచ్ కు చెందిన అనిల్ కుమార్ లహోటి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇంతకుముందు లహోటీ రైల్వే బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ లెవెల్-17లో తొలుత ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. గ్వాలియర్‌లో మాధవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అనిల్‌, ఐఐటీ రూర్కీలో పీజీ పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement