Wednesday, May 1, 2024

Flight crash: అప్ఘ‌న్ లో కుప్ప‌కూలిన అంబులెన్స్ ఫ్లైట్… ఆరుగురు గ‌ల్లంతు ..

ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోరం జరిగింది. భారత్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఆదివారం ఉదయం కూలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. అఫ్గానిస్తాన్‌లో తోప్‌ఖానా పర్వతాల్లో విమానం కూలిపోయిందని.. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగిందని పేర్కొంది.

అయితే, విమానం వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ప్రయాణించిందని.. ఆదివారం ఉదయం బదక్షన్‌లోని జెబాక్ జిల్లాలోని పర్వత భూభాగాన్ని ఢీకొట్టినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం సైతం నిర్ధారించింది.

- Advertisement -

ప్రాథమిక సమాచారం ప్రకారం, కిరణ్, మింజన్ జిల్లాలు.. బదక్షన్‌లోని జెబక్ జిల్లాలలో విస్తరించి ఉన్న తోప్‌ఖానా పర్వత ప్రాంతాలలో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, విమానం రకం, విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇంకా నిర్ణయించలేదని ప్రావిన్స్‌లోని భద్రతా అధికారులు తెలిపారు. అయితే, ముందుగా.. కుప్పకూలిన విమానం భారతదేశానికి సంబంధించినదని వార్తలొచ్చాయి. భారత్ నుంచి మాస్కోకు వెళుతుండగా విమానం క్రాష్ అయిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డీజీసీఏ.. అది భారత విమానం కాదని పేర్కొంది. భారత్‌ నుంచి ఆ సమయంలో షెడ్యూల్డ్‌ ఫ్లైట్స్‌ లేవన్న భారత అధికారులు.. ప్రమాదానికి గురైంది భారత విమానం కాదని నిర్ధారించాయి. కుప్పకూలిన విమానం మొరాకోలో రిజిస్టర్‌ అయిన విమానంగా అధికారులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement