Sunday, October 6, 2024

Navy helicopter crash | కుప్పకూలిన నేవీ హెలికాప్టర్.. ఒకరు మృతి

కేరళ రాష్ట్రం కొచ్చిలోని నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ గరుడ రన్‌వేపై ఇవ్వాల (శనివారం) రొటీన్ ట్రైనింగ్ డ్రిల్ సమయంలో చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై నావికాదళం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ సహా ఇద్దరికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. వారు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న కేరళ పోలీసులు, ఆర్మీ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement