Friday, May 10, 2024

ఉక్రెయిన్ వీడి రాలేనంటున్న ఇండియ‌న్‌.. వాటిని వ‌దిలేసి రాలేను.. ఇంత‌కీ ఆ పెట్స్ ఏంటో తెలుసా!

ర‌ష్యా చేప‌ట్టిన యుద్దంతో ఉక్రెయిన్ పెద్ద ఎత్తున ఆస్తుల‌ను న‌ష్ట‌పోయింది. కొన్ని ప్రాంతాలు శ్మ‌శానాల‌ను త‌ల‌పిస్తున్నాయి. అయితే.. అక్క‌డి నుంచి సొంతూళ్ల‌కు వెళ్తున్న విదేశీయులు త‌మ పెట్స్‌ని కూడా తీసుకెళ్ల‌డం క‌నిపించింది. వాటితో ఉన్న అనుబంధం వారిని వీడ‌కుండా చేస్తోంది. భార‌త్‌కు వ‌స్తున్న వారిలో చాలామంది త‌మ హస్కీల‌ను, పిల్లులను కూడా తీసుకువ‌చ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ కుమార్ పాటిల్ ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాన్‌బాస్‌లోని తన ఇంటి బంకర్‌లో ఉన్నారు. అక్క‌డే ఉండ‌డానికి ఆయ‌న ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే అతను తనకు చెందిన రెండు పెంపుడు జంతువుల‌ను విడిచి ఉండలేన‌ని చెబుతున్నారు. అవేంటో తెలిస్తే అంద‌రూ షాక్ అవుతారు. అవి త‌న పెంపుడు పెద్ద పులులు అందులో ఒక‌టి చిరుత, మ‌రొక‌టి బ్లాక్ జాగ్వార్ ఉన్నాయి.

తన వద్ద ఉన్న జాగ్వర్ జాతి ప్రపంచంలోనే అత్యంత అరుదైనదని, కేవలం 21 రకాలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు డాక్ట‌ర్ కుమార్‌. అందులో ఒకటి త‌న వ‌ద్ద ఉందని పేర్కొన్నాడు. ఈ జాతి పులులు సింహం కంటే చాలా ప్రమాదకరమైన జాతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన‌వి తెలిపాడు. కుమార్ తన పెంపుడు మగ జాగ్వర్‌కి “యాగ్వార్” అని పేరు పెట్టాడు. అతను 19 నెలలుగా ఈ ‘యాగ్వార్’ని చూసుకుంటున్నాడు. ఈ అరుదైన జాతుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో కుమార్ రెండు నెలల క్రితం ఈ రెండు జాగ్వర్ల మధ్య సంభోగం కోసం మరొక బ్లాక్ పాంథర్‌ను కొనుగోలు చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement