Monday, April 29, 2024

భారత్-థాయిలాండ్ సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం.. ఇరుదేశాల అవగాహన ఒప్పందం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత్ – థాయ్‌లాండ్ మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలంగా మారనున్నాయి. ఈ మేరకు గురువారం ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన వర్చువల్ కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, థాయిలాండ్ సాంస్కృతిక శాఖ మంత్రి హెచ్ఈ ఇత్తిఫోల్ కున్‌ఫ్లోమ్‌లు పరస్పరం ‘ఇండియా– థాయిలాండ్ కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్(సీఈపీ)’ ఎంఓయూపై వర్చువల్గా సంతకం చేశారు.

కాగా ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు 2022–27 మధ్యకాలంలో సాంస్కృతిక సంబంధాలను పరస్పరం ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. భారత్ థాయిలాండ్ మధ్య సీఈపీ  పురాతన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, బహుముఖ భాగస్వామ్యాలను మరింతగా పెంచుతుందని ఇరు దేశాల మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement