Sunday, May 19, 2024

భార‌త్ బౌలింగ్ ను ఉతికి ఆరేసిన పాక్ బ్యాట‌ర్స్ – ఇండియా టార్గెట్ – 150

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ ను దాయాది దేశం పాకిస్థాన్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ కు కేప్ టౌన్ ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో పాక్ నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 149 ప‌రుగులు చేసింది.. భార‌త్ విజ‌యం కోసం 150 ప‌రుగులు చేయాల్సి ఉంది.. 12 ఓవ‌ర్ల‌కు నాలుగు వికెట్లు కోల్పొయి 68 ప‌రుగులు చేసిన పాక్ ను మ‌రూఫ్, మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ ఆయేషాలు ఆదుకున్నారు.. ఈ ఇద్ద‌రు చివ‌రి 8 ఓవ‌ర్ల‌లో 81 ప‌రుగులు జోడించారు.. ఆయేషా 25 బంతుల‌లో 43 ప‌రుగులు చేయ‌గా, మ‌రూఫ్ 55 బంతుల‌లో 68 ప‌రుగులు చేసింది.. భార‌త్ బౌల‌ర్ల్ లో పూజ‌, దీప్తీల‌కు ఒక్కో వికెట్ ల‌భించ‌గా, రాధాయాద‌వ్ కు రెండు వికెట్లు ద‌క్కాయి.

కాగా, ఈ మ్యాచ్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఫిట్ నెస్ సమస్యలతో దూరమైంది. ప్రాక్టీసు మ్యాచ్ సందర్భంగా ఆమె స్మృతి గాయపడింది. ఆమె స్థానంలో హర్లీన్ డియోల్ కు తుది జట్టులో స్థానం కల్పించారు.
టీమిండియా…
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్.
పాకిస్థాన్…
బిస్మా మారూఫ్ (కెప్టెన్), మునీబా అలీ (వికెట్ కీపర్), జవేరియా ఖాన్, నిదా దార్, సిద్రా అమీన్, అలియా రియాజ్, ఆయేషా నసీమ్, ఫాతిమా సనా, అయిమాన్ అన్వర్, నష్రా సంధూ, సాదియా ఇక్బాల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement