Saturday, April 27, 2024

ఇండియా-రష్యా మధ్య రూపే, మీర్‌ కార్డులు.. కొత్త చెల్లింపుల వ్యవస్థ కోసం ప్రయత్నాలు

రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా చెల్లింపులు జరిపేందుకు రెండు దేశాలు రూపే, మీర్‌ కార్డులను అంగీకరించే అవకాశం ఉంది. ఈ దిశగా ఉన్న అవకాశాన్ని రెండు దేశాలు పరిశీలిస్తున్నాయి. ఇటీవల వాణిజ్యం, ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకారం (ఐఆర్‌ఐజీసీ-టీఈసీ) పై ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి అంతర్గత ప్రభుత్వ కమిషన్‌ సమావేశంలో ఈ కార్డుల ఆమోదాన్ని అనుమతి ఇచ్చేందున్న అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించారు. ఇండియాకు చెందిన రూపే కార్డు, రష్యాకు చెందిన మీర్‌ కార్డుల ద్వారా చెల్లింపులకు అంగీకరిస్తే, రెండు దేశాలకు చెందిన వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు చేసుకునే అవకాశం కలుగుతుంది.

సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, రష్యా ఉప ప్రధాన మంత్రి డెనిస్‌ మంటురోవ్‌ పాల్గన్నారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ రష్యకు చెందిన వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థ (ఎఫ్‌పీఎస్‌) చెల్లింపులకు అవకాశాలను కూడా అన్వేషించాలని కూడా తతతఅంగీకరించారు. వీటితో పాటు రష్యన్‌ ఫైనాన్షియల్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌ను, సర్వీసెస్‌ బ్యూరో ఆఫ్‌ ఫైనాన్సియల్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌ను అంగీకరించడానికి కూడా సమావేశంలో అంగీకరించారు. ప్రస్తుతం చెల్లింపులు ఇండియా నుంచి రష్యాకు, రష్యా నుంచి ఇండియాకు స్విఫ్ట్‌ నెట్‌వర్క్‌ ద్వారా జరుగుతున్నాయి.

- Advertisement -

ఇటీవల మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్‌ ప్రధాన మంత్రి లీ సియన్‌ లూంగ్‌ యూపీఐ, పేనౌ మధ్య సరిహద్దు కనెక్టివిటీని ప్రారంభించారు. దీంతో రెండు దేశాల్లోని వారు నేరుగా తక్కువ ఖర్చుతో వేగంగా చెల్లింపులు, నగదు బదిలీ చేయగలుగుతున్నారు. సింగపూర్‌లో ఉన్న కార్మికులు, ఉద్యోగులు, విద్యార్ధులు ఇతర వర్గాల వారు మన దేశానికి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయడం గతం కంటే వేగంగా తేలిగ్గా పంపించకలుగుతున్నారు. మన దేశం నుంచి సింగపూర్‌కు అలాగే పంపిస్తున్నారు.

పేనౌ, యూపీఐ లింక్‌తో ప్రపంచంలోనే రియల్‌ టైమ్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ విధానం అమల్లోకి వచ్చింది. మన దేశంలోని బ్యాంక్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ అవుట్‌ వర్డ్‌, ఇన్‌వర్డ్‌ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, డీబీఎస్‌ సింగపూర్‌ నుంచి వస్తున్న రిమెటెన్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఇదే మాదిరిగా రష్యా-ఇండియా మధ్య కూడా రియల్‌ టైమ్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌, చెల్లింపులు నిర్వహించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని ఈ రెండు దేశాలు అంగీకరించాయి. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement