Thursday, April 18, 2024

భారత్‌-నేపాల్‌ స్నేహం ప్రత్యేకం.. సుఖ.. దు:ఖాల సహచరులు: మోడీ

భారత్‌-నేపాల్‌ మధ్య ఉన్న స్నేహ సంబంధాలు ప్రపంచంలో ఎక్కడా కనిపించవని, తాము సుఖ.. దు:ఖాల సహచురులం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, నేపాల్‌ ప్రధాని దేవుబాను ఉద్దేశిస్తూ అన్నారు. నేపాల్‌లో ప్రధాని మోడీ రూపేని ప్రారంభించి.. ఆ దేశ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవుబా సమక్షంలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తొలి ఒప్పందంలో భాగంగా.. భారత్‌ నేతృతం వహిస్తున్న సౌర కూటమిలో నేపాల్‌ చేరింది. రెండో ఒప్పందంలో భాగంగా.. రైలే రంగంలో భారత్‌, నేపాల్‌ మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు ఒప్పందం కుదిరింది. నేపాల్‌కు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాపై మూడో ఒప్పందంలో.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, నేపాల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. నేపాల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఐఓసీఎల్‌ మధ్య సాంకేతికత సహకారం కోసం నాల్గో ఒప్పందం సంతకం చేసింది.

దేవుబా పాత మిత్రుడే.. : మోడీ

ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కీలక ఒప్పందాల విషయంలో ఎంతో సంతోషంగా ఉందన్న మోడీ.. భారతీయ నూతన సంవత్సరం, నవరాత్రులు జరుపుకుంటున్న శుభ సందర్భంగా, దేవుబా జీకి శుభప్రదమైన ఆగమనం అన్నారు. దేవుబా జీ భారత్‌కు పాత మిత్రుడు అని, ప్రధాని హోదాలో ఇది తనకు 5వ పర్యటన అన్నారు. భారత్‌-నేపాల్‌ సంబంధాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నేపాల్‌ శాంతి పురోగతిలో భారతదేశం ఒక దృఢమైన భాగస్వామి అని, తమ చర్చలో పరస్పర సంబంధాల గురించి విస్తృతంగా చర్చించామని మోడీ తెలిపారు. తమ భాగస్వామ్య విజన్‌ డాక్యుమెంట్‌ భాగస్వామ్య సహకారం కోసం కొత్త రోడ్‌ మ్యాప్‌ అవుతుందని, విద్యుత్‌ రంగంలో పరస్పర సహకారానికి గల అవకాశాలను సదినియోగం చేసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పంచేశ్వర్‌ ప్రాజెక్టు గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు. నేపాల్‌ తన మిగులు విద్యుత్‌ను భారత్‌కు ఎగుమతి చేయనుండటం సంతోషించాల్సి విషయం అన్నారు. నేపాల్‌ సౌర కూటమిలో భాగం కావడంతో తమ ప్రాంతంలో సచ్ఛమైన,

స్థిరమైన శక్తికి మూలం కానుందన్నారు. భారత్‌ ఆప్యాయత మరువలేం : దేవుబా

అనంతరం నేపాల్‌ ప్రధాని దేవుబా మాట్లాడుతూ.. నేపాల్‌తో పాటు నేపాల్‌ ప్రజల పట్ల భారత్‌ ఆప్యాయత, అనుబంధాన్ని తాను గౌరవిస్తున్నా అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ సంవత్సరం అమృత్‌ మహోత్సవ్‌లో, తాము ఇండో-నేపాల్‌ సంబంధాల 75 ఏళ్లు కూడా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో.. భారత్‌ నుంచి మొదటి కోవిడ్‌ వ్యాక్సిన్‌ పొందామన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో నేపాల్‌కు అందించిన సాయాన్ని మరువలేం అని తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడంపై తమ దృష్టి ఉందన్నారు. తాము భారతదేశం పురోగతి నుంచి లాభం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. నేపాల్‌లో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును త్వరంగా నిర్మించడంపై కూడా చర్చ జరిగిందన్నారు. అదనపు విమాన మార్గాలు, కనెక్టివిటీ కూడా పెంచాలని కోరానని, 1.5లక్షల మెట్రిక్‌ టన్నుల రసాయన ఎరువులు సరఫరా చేయాలని భారత్‌కు విజ్ఞప్తి చేశానని బావుజీ తెలిపారు. నేపాల్‌లో రూపే కార్డు ప్రారంభమైందని, ఇది భారతీయ పర్యాటకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement