Sunday, April 28, 2024

Archery | ధీరజ్ ప్రతిభ.. ఆసియా ఆర్చరీలో పతకాల పంట

ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో : ఏషియన్ కప్‌ పోటీల్లో విజయవాడ క్రీడాకారుడు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పథకాలను సాధించాడు. ఫిబ్రవరి 20వ తేదీ నుండి ఇరాక్ రాజధాని బాగ్దాద్లో జరుగుచున్న ఏషియా కప్ స్టేజ్-1లో రికర్వ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ భారతదేశాన్నికి ప్రాతినిధ్యం వహించాడు.

కాగా, ఈ పోటీల్లో రికర్వ్ పురుషుల విభాగంలో వ్యక్తిగత బంగారు పతకం, రికర్వ్ మెన్ టీమ్ (బొమ్మదేవర ధీరజ్, తరుణ్ప్,ప్రవీణ్ రమేష్ జాదవ్) విభాగంలో బంగారు పతకం, రికర్వ్ మిక్స్డ్ టీమ్ (బొమ్మదేవర ధీరజ్, సిమ్రన్జత్ కౌర్) విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. స్వర్ణ పతకాలు సాధించిన జాతీయ ఛాంపియన్, దేశంలోనే నెం.1 ర్యాంకర్ బొమ్మదేవర ధీరాజ్‌ను ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్ అభినందించాయి.

ఈ టోర్నీలో భారత్ మొత్తం తొమ్మిది స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యం పతకం గెలుచుంది.

  • మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో బంగారు పతకం గెలుచుంది దీపికా కుమారి. జూన్ 2022లో పారిస్ ఆర్చరీ ప్రపంచ కప్ తర్వాత తన మొదటి అంతర్జాతీయ పోటీలో పోటీపడుతున్న దీపిక, సిమ్రంజీత్ కౌర్‌ను ఆల్-ఇండియన్ ఫైనల్‌లో 6-2తో ఓడించి వ్యక్తిగత రికర్వ్ టైటిల్‌ను గెలుచుకుంది.
  • మహిళల స్వర్ణ పతక పోరులో పర్నీత్ కౌర్ ఇరాన్‌కు చెందిన ఫతేమె హెమ్మతీపై గెలుపొందగా, పురుషుల టైటిల్ కోసం ప్రథమేష్ జవ్కర్.. సహచరుడు కుశాల్ దలాల్‌పై విజయం సాధించాడు.
  • సిమ్రంజీత్ కౌర్, దీపికా కుమారి, భజన్ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు 5-4తో షూటౌట్ ద్వారా ఉజ్బెకిస్తాన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.
  • ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ రమేష్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌ల త్రయం పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 6-2తో మట్టికరిపించింది.
  • మిక్స్‌డ్ టీమ్ రికర్వ్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ జట్టు దియా సిద్ధిక్, ఎండీ సాగూర్ ఇస్లామ్‌లను 6-0తో ఓడించి.. స్వర్ణాన్ని గెలుచుకున్నారు ధీరజ్, సిమ్రంజీత్.
  • ఇక నిన్న (శనివారం) జ‌రిగిన మ్యాచ్లలో భారత ఆర్చర్లు నాలుగు పతకాలు సాధించారు., పురుషుల, మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగాల్లో టాప్ పోడియంలో నిలవగా… మహిళల జట్టు రజతంతో ముగించారు.
  • మూడో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో సహచరురాలు ప్రియా గుర్జార్‌ను ఓడించి వ్యక్తిగత మహిళల కాంపౌండ్ ఈవెంట్‌లో అదితి స్వామి కాంస్యం సాధించింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement