Friday, May 10, 2024

Narzo 70 Pro 5G | మార్కెట్‌లో రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్ డేట్ ఇదే !

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ Realme Narzo 70 Pro 5Gని త్వరలో విడుదల చేయబోతోంది. భారత్‌లో ఈ ఫోన్ లాంచ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది కంపెనీ. రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ మార్చిలో భారతదేశంలో లాంచ్ కానుంది. రియల్‌మీ ఈ ఫోన్ లాంచ్‌ను కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా అమ్మకానికి అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించింది..

రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ ఫీచర్లు

ఈ ఫోన్‌లో కంపెనీ 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను అందిస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో రానుంది. 1/1.56 అంగుళాల సెన్సార్ పరిమాణంతో వచ్చే సెన్సార్‌ను ఫోన్ ప్రధాన కెమెరాగా అందించనున్నారు. ఈ ఫోన్ ప్రధాన కెమెరా మునుపటి వెర్షన్ కంటే 64 శాతం ఎక్కువ కాంతిని క్యాప్చర్ చేస్తుంది.

రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీలో మునుపటి వెర్షన్‌తో పోలిస్తే వినియోగదారులు మెరుగైన సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని పొందుతారని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా వినియోగదారులు రియల్‌మీ నార్జో మునుపటి ఫోన్‌లతో పోలిస్తే ఈ ఫోన్‌లో మెరుగైన కెమెరా సెటప్‌ను పొందుతారు. అందువల్ల వారి ఫోటోగ్రఫీ అనుభవం కూడా మెరుగ్గా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement