Thursday, September 21, 2023

India Corona | దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా వైరస్‌ కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి దాకా పెరిగిన కేసులు నేడు స్వల్పంగా తగ్గాయని వైద్యాధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. తాజాగా
గడిచిన 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 114 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,81,154కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,119 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో 5,30,726 మంది మరణించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement