Wednesday, May 1, 2024

INDEPENDENS DAY : మ‌ణిపూర్ లో త్వ‌ర‌లోనే శాంతి.. ఎర్ర‌కోట పై నుండి ప్ర‌ధాని మోడీ హామీ

మణిపూర్ ప్రజలతో ఈ దేశం ఉందని… శాంతితోనే సమాధానం లభిస్తుంది.. కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి.. శాంతిని నెలకొల్పుతామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఢిల్లీ ఎర్ర‌కోట పై నుండి హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా పదో సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈసంద‌ర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారతదేశాన్ని అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు పట్టిపీడిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాటిని సమూలంగా నిర్మూలించాలని దేశ ప్రజలను కోరారు. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని.. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. సాంకేతిక అభివృద్ధి సాయంతో అవినీతిని అరికట్టే ప్రయత్నం వేగంగా సాగుతోందని అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

“అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను సమూలంగా నిర్మూలిస్తేనే దేశ అభివృద్ధి నిరాంటంకంగా సాగుతుంది. అవినీతి చెదలను సమూలంగా తుదముట్టించాలి. బుజ్జగింపు రాజకీయాలను మానుకోవాలి. పారదర్శక విధానాలతో అవినీతి నిర్మూలనకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు దేశానికి కోలుకోలేని నష్టం మిగిల్చాయి. అవినీతి, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి.”

విశ్వంలో భారత్ పట్ల సరికొత్త ఆకర్షణ, విశ్వాసం, ఆశ కలుగుతున్నాయన్నారు. ఇప్పుడు మన దగ్గర ప్రజాస్వామ్యం ఉందని, మన దగ్గర వైవిధ్యం ఉందన్నారు. యువతతో భారత్ జోరుగా ఉందన్నారు. కోట్ల మంది సంకల్పం, ఆలోచనలతో భారత్ ఉందన్నారు. మనం ఇప్పుడు ఏం చేసినా.. వచ్చే వెయ్యేళ్లపాటూ అది దిశానిర్దేశంగా మారుతుందన్నారు. యువ శక్తిపై త‌నకు నమ్మకం ఉందన్నారు. ప్రపంచంలోని స్టార్టప్‌లలో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు. టెక్నాలజీలో భారత్ సరికొత్త భూమిక పోషిస్తోందన్నారు.

- Advertisement -

టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి కూడా యువత సమర్థత చాటుకుంటోందన్నారు. క్రీడల్లో కూడా యువత సత్తా చాటుతున్నారు. చిన్న గ్రామాల నుంచి వచ్చిన వారు శాటిలైట్లు తయారు చేస్తున్నారన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతిభ చాటుతున్నారన్నారు. దేశం దూసుకెళ్తోందంటే.. ఇది అందరి వల్లేన‌న్నారు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement