Monday, April 29, 2024

IND vs ENG | హిట్‌మ‌న్ దంచికొట్టాడు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) లక్నో వేదికగా భార‌త్- ఇంగ్లాండ్ జట్ట మ‌ధ్య మ్యాచ్‌ జ‌రుగుతొంది. కాగా.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 229 ప‌రుగులు చేసింది. ఇక‌ డిఫెండ్ లోనూ రాణించి.. మహా సంగ్రామంలో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కాగా, చేజింగ్ దిగ‌నున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో గెలుపొందాలి అంటే 230 ప‌రుగులు చేయాల్సి ఉంది.

అయితే.. గ‌త ఐదు మ్యాచ్ ల‌తో పోల్చితే ఇవ్వాల్టి ఆట‌లో అంత‌గా రాణించ‌లేక‌పోయారు భార‌త బ్యాట‌ర్లు. దీంతో భారం బౌల‌ర్ల పైనే ప‌డ‌నుంది. ఇక పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలతో డిఫెండింగ్ కు దిగ‌నుంది రోహిత్ సేన‌. కాగా, ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ (87) ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ (39) ప‌రువాలేద‌నిపించాడు. ఇక టీమిండియా వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో సూర్య‌కుమార్ (49) ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు.

- Advertisement -

వరుస ఓటములతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో అయినా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇక భారత్ ను 229 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన ఇంగ్లండ్ సెంకండ్ ఇన్నింగ్స్ లోనూ రాణించి.. సెమీస్‌కు ఏ మాత్రం అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంగ్లండ్‌ జట్టు భావిస్తోంది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్ లైన‌ప్ బలంగానే ఉంది. జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ఆట‌గాల్లు తమదైన రోజున ఎంత విధ్వంసం సృష్టిస్తారో క్రికెట్‌ ప్రేమికులకు తెలుసు. రూట్ కూడా రాణించాలని చూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement