Friday, May 3, 2024

పెరిగిన జొమాటో నష్టం

ఆహార పదార్థాల డెలివరీ సంస్థ జొమాటోకు త్రైమాసిక నష్టాలు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.63 కోట్లున్న నష్టాలు, ఇప్పుడు ఎకాఎకి రూ.347 కోట్లుగా నమోదయ్యాయి. గత త్రైమాసికంలో రూ.251 కోట్ల నష్టాల్ని ప్రకటించిన జొమాటో ఆ తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగులను కూడా తొలగించింది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. అయినా ఆశించిన ఫలితాలు రాబట్టేలక పోతున్నది. అయితే లాభాలు లేకున్నా,,, ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతున్నది. ఈసారి 75శాతం వృద్ధి నమోదైంది. రూ.111.2 కోట్ల నుంచి రూ. 194.8 కోట్లకు చేరింది. మునుపటి త్రైమాసికంతో పోల్చితే ఇది దాదాపు 17 శాతం ఎక్కువ.

Advertisement

తాజా వార్తలు

Advertisement