Tuesday, June 18, 2024

పెరిగిన యూకే విజిటర్‌, విద్యార్ధి వీసాల ఫీజులు.. ఆక్టోబర్‌ 4 నుంచి అమలు

విజిటర్‌ వీసాలు, విద్యార్ధి వీసాల ఫీజులు పెంచుతున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన ఫీజులు అక్టోబర్‌ 4 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒక బిల్లును బ్రిటిష్‌ పార్లమెంట్‌లో హోం శాఖ ప్రవేశపెట్టింది. ఆరు నెలల లోపు లభించే విజిటర్‌ వీసా ఫీజును 115 జీబీపీకి, స్టూడెంట్‌ వీసా ఫీజును 490 జీబీపీకి పెంచినట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వేతనాలు పెంచినందున వీసా అప్లికేషన్‌ ఫీజులను, నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) హెల్త్‌ సర్‌ఛార్జీని పెంచనున్నట్లు బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునక్‌ జులైలోనే ప్రకటించారు.

ఈ ప్రకటనకు అనుగుణంగానే వీ సా ఫీజులు పెంచుతూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఎన్‌హెచ్‌ఎస్‌ సేవల కోసం విద్యార్ధి వీసా ఫేజును, ఇమిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌ఛార్జ్‌ (ఐహెచ్‌ఎస్‌)ను పెంచినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. వర్క్‌ వీసా, విజిట్‌ వీసా ఫీజులను 15 శాతం వరకు, ప్రాయార్టీ వీసా ఫీజులను 20 శాతం పెంచుతున్నట్లు హోం శాఖ తెలిపింది.

- Advertisement -

రెండు, ఐదు, పది సంవత్సరాల విజిట్‌ వీసాల రేట్లు కూడా పెంచుతున్నట్లు హోం శాఖ తెలిపింది. పార్లమెంట్‌ ఆమోదం తరువాత ఆక్టోబర్‌ 4 నుంచి పెంచిన ఫీజులు అమల్లోకి వస్తాయని హోం శాఖ తెలిపింది. ప్రతి సంవత్సరం మన దేశం నుంచి భారీ సంఖ్యలో విద్యార్ధులు, విజిటర్స్‌ బ్రిటన్‌ను సందర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement