Wednesday, May 22, 2024

TS | సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ప‌లువురు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. తాజాగా బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క తదితరులు ఉన్నారు. అంతకుముందు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజగోపాల్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement