Friday, May 17, 2024

ఆకట్టుకున్న సార్ టీజర్.. ఎడ్యుకేషన్‌ మాఫియాను ఎదిరించే టీచర్‌గా ధనుష్‌..

వెంకీ అట్లూరితో తమిళ స్టార్ ధనుష్ చేస్తున్న‌ తెలుగు – తమిళ ద్విభాషా చిత్రం. సితార నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా, ఈరోజు ధనుష్ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. కార్పోరేట్ సంస్థలు డబ్బు కోసం విద్యావ్యవస్థను ఎలా చంపేస్తున్నాయి అనే రిలేటెడ్ సబ్జెక్ట్‌తో సర్ మూవీ రూపోందుతుంది. కార్పోరేట్ వ్యవస్థపై బాలగంగాధర్ తిలక్ అనే ఒక‌ లెక్చరర్ చేసిన పోరాటం ఇది.

ప్రతి ఒక్కరూ ఈ సబ్జెక్ట్‌కి కనెక్ట్ అవుతారు, అయితే ఇంకా సర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కాకకోతే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి మార్కుల‌ను సంపాదిస్తోంది., ఇది ఈ సినిమా ప్రమోషన్లకు సరైన ప్రారంభం అనే చెప్పాలి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement