Thursday, May 23, 2024

Jammu and Kashmir : అక్ర‌మ చోర‌బాటుకు ప్రయత్నం… ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీరులో శనివారం పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటుకు య‌త్నించారు. అఖ్నూర్ ప్రాంతంలో చొరబాటుకు ప్ర‌య‌త్నించిన‌ ఓ ఉగ్రవాదిని జ‌వాన్లు మ‌ట్టుబెట్టారు. పాకిస్థాన్ దేశం నుంచి నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారతదేశంలోకి చొరబడేందుకు చేసిన యత్నాన్ని భారత జవాన్లు వమ్ము చేశారు.

భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి)లో కాపలా కాస్తున్న భద్రతా బలగాలు చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. శనివారం నలుగురు ఉగ్రవాదులు అఖ్నూర్ ఖౌర్ సెక్టారులోకి చొరబడేందుకు చేసిన యత్నాన్ని భద్రతా బలగాలు విఫలం చేశాయి. పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆర్మీజవాన్లు మరణించారు. గురువారం తెల్లవారుజామున భారత జవాన్లు గాలిస్తుండగా ధాత్వార్ మోర్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తామే ఈ దాడులకు పాల్పడ్డామని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement