Thursday, December 1, 2022

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఇడుపులపాయ త్రిపుల్‌ ఐటీ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఈశ్వర్‌ అనే విద్యార్థి కళాశాలలోని హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థి వద్ద సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్న ట్రిపుల్‌ ఐటీ అధికారులు పోలీసులకు అప్పగించారు. విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement