ఐసిఐసిఐ ఫ్రూడెన్షియల్ వచ్చిన అసెట్ అలోకేషన్ ఫండ్ ఇన్వెస్టర్లకు మంచి రాబాడిని అందించింది. 12 సంవత్సరాల్లో ఈ ఫండ్ 43 శాతం రిటర్న్స్‌ను అందించినట్లు సంస్థ తెలిపింది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే చాలా మంది సరైన నిర్ణయం తీసుకోలేరు. ముఖ్యంగా సరైన ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలంటే సామాన్యులకు పెద్ద సవాల్. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే సమయంలో చాలా విషయాలను ఆలోచించాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్‌తో ముడిపడి ఉన్నందున రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి కంటే రాబడి తక్కువగా ఉంటుంది. అందు వల్ల సరైన వాటిలోనే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పన్నుల మిన్హయింపు, స్వల్పకాలిక, దీర్ఘకాలి రాబడులపై అంచనా ఇలా ఒక నిర్ణయానికి రావడం పెద్ద సవాల్‌తో కూడిన విషయం. ఇలాంటి సమయంలోనే ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ నుంచి వచ్చి అసెట్ అలోకేషన్ ఫండ్ ఈ ఫండ్ ఈక్విటీ, డెబిట్, గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారు. 2010 మార్చిలో ఈ ఫండ్ ప్రారంభమైంది. అప్పుడు ఒక ఇన్వెస్టర్ ఇందులో 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు అనుకుంటే ప్రస్తుతం దాని విలువ 41.41 లక్షలుగా ఉందని ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో నిఫ్టీ 50 లోని షేర్లపై పెట్టుబడి పెట్టి ఉంటే , 39.03 లక్షల రాబడి మాత్రమే వచ్చేందని వివరించింది.
దీర్ఘ కాలంలో ఐసిసిఐ మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ పెట్టుబడి కంటే అధిక రాబడిని ఇచ్చిందని పేర్కొంది. ఫండ్ ప్రారంభమైన 2010 మార్చి 1 నుంచి 2022 మార్చి 31 వరకు వచ్చిన రాబడిని లెక్కించడం జరిగిందని, ఇది 43 శాతంగా ఉందని తెలిపింది. ఈ ఫండ్‌లో పెట్టిన పెట్టుబడులను ప్రధానంగా ఈక్విటీ, డెబిట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లోనూ, బంగారంలోనూ ఇన్వెస్ట్ చేశారు. కరోనా కాలంలో మార్చి 2020 నాటికి ఈక్విటీ మార్కట్‌లో 83 శాతం ఫండ్స్‌ను, మార్కెట్లు కోలుకున్న తరువాత 2020 డిసెంబర్ కి 45 శాతం, ప్రస్తుతం 33 శాతం ఉందని కంపెనీ తెలిపింది. మార్కెట్‌లో పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఫండ్ పనితీరు బాగుందని, మంచి రాబడిని అందించిందని తెలిపింది. 2015 జనవరి నుంచి 2017 ఏప్రిల్ వరకు సెన్సెక్స్ 30 వేల మార్క్‌లో ఉంది. అప్పుడు మార్కెట్లు ప్లాట్‌గా ఉన్న సమయంలోనూ ఈ ఫండ్ 10.8 శాతం రాబడిని అందించని ఐసీసీఐ ప్రూడెన్షియల్ తెలిపింది. ఈ స్కీమ్‌లో 3, 5, 7 సంవత్సరాల కాల పరిమితితో పెట్టుబడులు పెట్టివారికి కూడా 10 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ల స్థితిగతులు, ఇతర అంశాలను జాగ్రత్తగా నిర్వహించడం వల్లే ఈస్థాయిలో రాబడి వ చ్చిందని ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ ఫండ్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.