Sunday, May 19, 2024

ఐసీసీ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ ర్యాంక్​.. ఫోర్త్​ ప్లేస్​కి దిగజారిన భారత్‌

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ జాబితాలో భారత్‌ ఒక మెట్టు దిగి 4 స్థానానికి చేరింది. మన దాయాది పాకిస్తాన్‌ మనకన్నా ఒక స్థానం మెరుగ్గా ఉండటం విశేషం. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ టెస్ట్‌మ్యాచ్‌లో ఓడిపోయిన భారత జట్టు స్లో ఓవర్‌ రేట్‌ తోడవడంతో 2 పాయింట్లు తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ వల్ల భారత జట్టు మ్యాచ్‌ ఫీజ్‌లో 40 శాతం పెనాల్టిగా విధించారు.

ఐసీసీ డబ్ల్యుటీసీ 2021-23 తాజా జాబితా ప్రకారం ఆస్ట్రేలియా 84 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో సౌతాఫ్రికా (60 పాయింట్లు), మూడో స్థానంలో పాకిస్తాన్‌ 44 పాయింట్లు, నాలుగో స్థానంలో భారత్‌ (75 పాయింట్లు) ఐదో స్థానంలో వెస్టిండీస్‌ (54 పాయింట్లు )జట్టు ఉన్నాయి. అయితే పర్సంటేజీల ప్రకారం చూస్తే ఆస్ట్రేలియా 77.78, సౌతాఫ్రికా 71.43, పాకిస్తాన్‌ 52.38, ఇండియా 52.98, వెస్టిండీస్‌ 50 శాతంతో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement