Monday, April 29, 2024

ఐసీసీ ర్యాంకింగ్స్ లో అదరగొడుతున్న శ్రేయస్‌, టాప్‌-10 నుంచి కోహ్లీ, రోహిత్‌ ఔట్‌..

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాప్‌ 10 నుంచి పడిపోయారు. అదే సమయంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌ ఏకంగా 27 స్థానాలు ఎగబాకాడు. టాప్‌ 10లో భారత్‌ నుంచి ఒక్క కేఎల్‌ రాహుల్‌కు మాత్రమే చోటు దక్కింది. ఇక బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అయితే భారత్‌ నుంచి టాప్‌ 10లో ఏ ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. భువనేశ్వర్‌ కుమార్‌ మాత్రం టాప్‌ 20లో ఉన్నాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో.. భారత్‌ నుంచి కేఎల్‌ రాహుల్‌ టాప్‌ 10లో ఉన్నాడు. అతని ఖాతాలో 646 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఇక ఆ తరువాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 13వ స్థానానికి, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 15వ స్థానానికి పడిపోయారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంకతో సిరిసీలో 50 పరుగులు మాత్రమే చేశాడు. ఒక విరాట్‌ కోహ్లీ వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌ తరువాత మళ్లిd ఆడలేదు. ఇవన్నీ ర్యాంకులపై ప్రభావం చూపించాయి.

శ్రీలంక సిరీస్‌లో రాణించిన శ్రేయస్‌..

ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచుల్లో అజేయ హాఫ్‌ సెంచరీలతో చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌.. 27 స్థానాలు ఎగబాకి.. 18వ ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రీలంకతో సిరీస్‌లో మొత్తం 204 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్కసారి కూడా ఔటవ్వలేదు. ఇక ఐసీసీ టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లో ఏ ఒక్క భారత్‌ బౌలర్‌కు కూడా చోటు దక్కలేదు. టాప్‌ 20లో మాత్రం భువనేశ్వర్‌ కుమార్‌ ఒక్కడికే చోటు దక్కింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో రాణించిన భువనేశ్వర్‌ కుమార్‌ 3 స్థానాలు ఎగబాకి.. 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. అదే సమయంలో జస్పిత్‌ బుమ్రా 3 స్థానాలు దిగజారి 28వ ర్యాంకుకు పడిపోయాడు. ఇక భారత్‌తో రెండో టీ20 మ్యాచులో 75 పరుగులతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్‌ పాతుమ్‌ నిస్సాంక 9వ స్థానానికి ఎగబాకాడు.

టాప్‌లో బాబర్‌, రిజ్వాన్‌..

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ ఓపెనర్లు బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ రిజాన్‌లు 1, 2వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ ఎయిడెన్‌ మాక్రమ్‌, నాల్గో స్థానంలో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలాన్‌ ఉన్నారు. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డేవాన్‌ కానే ఐదో స్థానంలో, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఆరో స్థానంలో ఉన్నారు. డస్సెన్‌ ఏడు, మార్టిన్‌ గుప్తిల్‌ 8వ స్థానంలో ఉన్నారు. టెస్టు ఫార్మాట్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లో రవి చంద్రన్‌ అశ్విన్‌, జస్పిత్‌ బుమ్రా ఉన్నారు. 839 రేటింగ్‌ పాయింట్లతో అశ్విన్‌ రెండో స్థానంలో, 763 రేటింగ్‌ పాయింట్లతో బుమ్రా పదో స్థానంలో ఉన్నారు. ఇక ఆల్‌ రౌండర్ల జాబితాలో అశ్విన్‌, రవీంద్ర జడేజాలు రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement