Saturday, May 18, 2024

ఐబీపీఎస్ పరీక్షల క్యాలెండర్ విడుదల

దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల‌ను భ‌ర్తీచేసే ఐబీపీఎస్ ఈ ఏడాది నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష‌ల తేదీల‌తో క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ క్ల‌ర్క్‌, పీవో, ఎస్‌వో ప‌రీక్ష‌ల‌ తేదీల‌ను ప్ర‌క‌టించింది.

★ ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ప్రిలిమ్స్‌: ఆగ‌స్టు 1, 7, 8, 14, 21 తేదీల్లో, మెయిన్స్: సెప్టెంబ‌ర్ 25, అక్టోబ‌ర్ 3
★ ఐబీపీఎస్ క్ల‌ర్క్‌ ప్రిలిమ్స్‌: ఆగ‌స్టు 28, 29, సెప్టెంబ‌ర్ 4, 5 తేదీల్లో, మెయిన్స్: అక్టోబ‌ర్ 31
★ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్‌: అక్టోబ‌ర్ 9, 10, 16, 17 తేదీల్లో, మెయిన్స్: న‌వంబ‌ర్ 27
★ ఐబీపీఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్‌: డిసెంబ‌ర్ 18, 26, మెయిన్స్: 2022, జ‌న‌వ‌రి 30
కాగా.. ఒకే ప‌రీక్ష ఉండే ఆఫీస‌ర్ స్కేల్-2, 3 ఎగ్జామ్స్‌ను సెప్టెంబ‌ర్ 25న నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement