Sunday, May 5, 2024

భారీగా వాణిజ్యలోటు.. పెరుగుతున్న దిగుమతులతో ఇబ్బంది

మన దేశ వాణిజ్య లోటు అంతకంతకూ పెరుగుతోం ది. జూన్‌లో ఇది 25.63 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అదే సమ యంలో మన దేశం నుంచి ఎగు మతులు 16.8 శాతం పెరిగి 37.94 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నా యి. దిగుమతులు 63.58 బిలియ న్‌ డాలర్లుగా ఉన్నాయి. దిగుమ తుల్లో అధిక భాగం బంగారం, బొగ్గు, ముడి చమురు ఉన్నాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జూన్‌ నెల లో ముడి చమురు దిగుమతులు 20.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బంగారం దిగుమతు లు 169 శాతం పెరిగి 2.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తి తక్కువగా ఉందన్న కారణంతో విదేశీ బొగ్గు దిగుమతులు తప్పనిసరి చేసింది. రాష్ట్రాలు విద్యుత్‌ ఉత్తత్తి కేంద్రాల్లో ఉపయోగించే బొగ్గులో 10 శాతం విదేశీ బొగ్గు ఉండాలన్న నిబంధన విధించడంతో ఈ దిగుమతులు పెరుగుతున్నాయి. ఫలితంగా జూన్‌లో బొగ్గు దిగుమతు లు 248 శాతం పెరిగి 6.4 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

విదేశీ వాణిజ్యలోటు పెరగడానికి దిగుమతులు పెరిగుతూ, ఎగుమతులు తగ్గడమే ప్రధాన కారణమని ప్రముఖ ఆర్థికవేత్త అతిధి నాయర్‌ అభిప్రాయపడ్డారు. మే నెలతో పోల్చితే బంగారేతర దిగుమతు లు భారీగా పెరిగాయన్నారు. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో విదేశీ వాణిజ్యలోటు రికార్డ్‌ స్థాయిలో 30 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్‌ అకౌంట్‌ లోటు కూడా భారీగా పెరుగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా భారీగా అమ్మకాలకు పాల్పడుతుండంతో నిధులు భారీగా తరలిపోతున్నాయి. ఫలితంగా మన రూపాయి అత్యంత బలహీనంగా మారి డాలర్‌తో మాకరం విలువ 79 రూపాయలకు చేరుకుంది. ఎగుమతుల్లో ప్రధానంగా ఫార్మాసూటికల్స్‌ 1.6 శాతం ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు కూడా జూన్‌లో పెరిగాయి. వజ్రాలు, బంగారు నగల ఎగుమతులు 19.4 శాతంగా ఉన్నాయి. రెడీమెడ్‌ గార్మెంట్స్‌ ఎగుమతులు 44.7 శాతం ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం తరువాత ఏర్పడిన పరిస్థితుల మూలం గా ఇంజనీరింగ్‌ ఎగుమతులపై ప్రభావం పడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దిగుమ తుల్లో ముడి చమురు వాటానే 94.2 శాతంతో 20.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మరో వైపు బొగ్గు దిగుమతుల మూలంగా కూడా వాణిజ్యలోటు పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేశారు. ఇటీవల బంగారు దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 15 శాతం దిగుమతి సుంకం విధించారు. దిగుమతులు తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత ఎక్కువగా ఉండాలని నిపుణులు సూచించిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement