Sunday, April 28, 2024

జీహెచ్‌ఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ ఎంసీ)కి 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారీగా ఆదాయం వచ్చిందని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎందుకంటే టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పలు భవనాలకు అనుమతులు ఇవ్వడంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినందుకు గాను ఈ ఆదాయం వచ్చినట్లు జీహెచ్‌ఎంసీ వివరించింది. ముఖ్యంగా 2021-22లో 17,572 భవనాలతో పాటు 1, 550 ఆక్యుపెన్సీ సరిఫికెట్లు జారీ చేసినట్లు తెలిపింది.

ఇందుకు రూ.1144.08 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొంది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 11,538 భవనాలకు అనుమతులు, 1574 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినందుకు కేవలం రూ.661 కోట్ల మాత్రమే వచ్చిందని వివరించింది. అయితే గత ఆర్థిక సంవత్సరం కంటే 2021-22లో 73 శాతం అధిక ఆదాయం జీహెచ్‌ఎంసీకి వచ్చిందని తెలపడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement